ఆచారి అమెరికా యాత్ర విడుదల వాయిదా

మరిన్ని వార్తలు

ఈ వారంలో వచ్చే రిపబ్లిక్ డే కానుకగా తెలుగులో చిత్రాల విడుదల పెద్ద ఎత్తున ఉండబోతున్నధీ అని అనుకున్న ప్రేక్షకులందరికీ ఇది కచ్చితంగా చేదు వార్తే. 

ఇక వివరాల్లోకి వెళితే, ఈ 26వ తేదిన విడుదల కావాల్సి ఉన్న మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర చిత్రం విడుదల వాయిదాపడింది. దీనికి ప్రాధమిక కారణం- సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వవలసిన అధికారి అందుబాటులో లేని కారణంగా ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కావట్లేదు అని తెలిసింది. 

దీనితో ఈ వారం తెలుగు సినిమాల పరంగా- అనుష్క నటించిన భాగమతి చిత్రం ఒక్కటే విడుదల కాబోతున్నది. ఇప్పటికే మంజుల డైరెక్షన్ చేసిన మనసుకు నచ్చింది చిత్రం ఫిబ్రవరికి వెళ్ళగా ఇప్పుడు ఈ ఆచరి అమెరికా యాత్ర చిత్రం కూడా వచ్చే నెలకి వెళ్ళిపోయింది.

మొత్తానికి కారణాలు ఏవైనా ఈ వారం అనుష్క భాగమతి మాత్రమే విడుదలైతున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS