నటుడు చిన్నా ఇంట్లో విషాదం

మరిన్ని వార్తలు

నటుడు చిన్నా (శివ ఫేం) భార్య శిరీష (42) ఇక లేరు.

వివరాల్లోకి వెళితే, చిన్నా భార్య అయిన శిరీష గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో భాదపడుతున్నారట. ఈ క్రమంలోనే ఆమె సోమవారం రోజున హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన తెలిపారు.

ఇక వీరిరువురికి భావన, మౌనిక అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఈ విషాదం తెలుసుకున్న పలువురు సినీప్రముఖులు నటుడు చిన్నాకి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు.

ఈ సందర్భంగా www.iqlikmovies.com తరపున చిన్నా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS