అదిరిందమ్మా అందాల బొమ్మా!

మరిన్ని వార్తలు

'హార్ట్‌ ఎటాక్‌' బ్యూటీ ఆదా శర్మ ఫ్యాషన్‌ ఐకాన్‌ అని ఎప్పుడో అన్పించేసుకుంది. జిమ్నాస్టిక్స్‌లో ప్రావీణ్యం వున్న ఆదా శర్మ మల్టీ టాలెంటెడ్‌. పాటలు బాగా పాడుతుంది ఈ బ్యూటీ. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌పై సంపూర్ణమైన అవగాహన తన సొంతమని చెబుతుంటుంది ఆదా శర్మ. ఫిట్‌నెస్‌పై అవగాహన మాత్రమే కాదు, ఫిట్‌నెస్‌ పాఠాలు కూడా చెప్పగలదట. ఆ సంగతేమోగానీ డిజైనర్‌ వేర్‌లో మెరిసిపోవడం, సంప్రదాయ దుస్తుల్లో సత్తా చాటడం, వెస్ట్రన్‌ ఔట్‌ ఫిట్స్‌లో చెలరేగిపోవడం ఇవన్నీ ఆదా శర్మకి వెన్నతో పెట్టిన విద్య. ఏ పోజ్‌ ఫొటోజెనిక్‌గా వుంటుందో కూడా ఈమెకు బాగా తెలుసు. ఫొటోగ్రఫీలో మాస్టర్‌ డిగ్రీ చేసేసిందా? అనే స్థాయిలో ఆదా శర్మ లుక్స్‌ వుంటాయి ఆయా ఫొటోల్లో. ఇదిగో ఈ ఫొటో ఆదా శర్మకి చాలా చాలా ఇష్టమట. ఎందుకంటే, హాట్‌గానే కాదు క్యూట్‌గానూ కన్పిస్తోంది గనుక అట. నిజమే, అచ్చంగా అందాల బొమ్మ అన్పించేలా వుందీ ఫొటోలో ఆదా శర్మ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS