అజ్ఞాతవాసి రెండో రోజు కలెక్షన్స్

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాకి సంబంధించి రెండో రోజు కలెక్షన్స్ అందరికి ఆశ్చర్యకలిగించేలా ఉన్నాయి. దీనికి కారణం సినిమా విడుదలైన మొదటిరోజు నుండే నెగటివ్ టాక్ రావడం.

అయితే ఈ సినిమాకి రెండవ రోజు కేవలం రూ 6కోట్లు రావడంతో అజ్ఞాతవాసికి ఎంతటి ప్రతికూల పరిస్థితి ఉన్నదో తెలుసుకోవచ్చు.  రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఏరియాలో మొదటిరోజుకి రెండవ రోజుకి కలెక్షన్స్ పరంగా ఎంత తక్కువగా ఉన్నాయో అన్నది అర్ధమవుతున్నది.

 

మొదటిరోజు రెండు రాష్ట్రాల్లో సుమారు రూ 36కోట్ల వరకు వసూళ్ళు సాదిస్తే రెండవ రోజు వచ్చిన వాటితో కలిపితే రూ 42 కోట్ల వరకు చేరింది.
ఇక బయట రాష్ట్రాల్లో పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది అని ట్రేడ్ వర్గాల సమాచారం.అమెరికాలో కూడా కలెక్షన్స్ బాగా తగ్గిన్నట్టు తెలుస్తున్నది. 

ఈ పరిస్థితుల్లో మూడవ రోజు రెండు సినిమాలు విడుదల అవుతున్న వేళ ఈ కలెక్షన్స్ ఇంకా తగ్గిపోతాయి అని కూడా అంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS