'హలో' అఖిల్‌ ఏంటా దూకుడూ!

మరిన్ని వార్తలు

అక్కినేని అందగాడు అఖిల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'హలో'. తొలి సినిమా 'అఖిల్‌' నిరాశ పరచడంతో ఈ సినిమాను అఖిల్‌కి రీ లాంచింగ్‌ మూవీగా అభివర్ణించాడు నాగార్జున. ఈ సినిమాని అన్నపూర్ణ ఆర్ట్స్‌ బ్యానర్‌లో నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. 'మనం' డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా 'హలో' సినిమా నుండి ఓ పోస్టర్‌ విడుదలైంది.  

ఇప్పుడీ పోస్టర్‌ వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌లో అఖిల్‌ సెల్‌ఫోన్స్‌ మీద నుండి దూకుతున్నట్లుగా ఉంది. ఆ దూకుడు అదిరిందిలే. ఈ పోస్టర్‌ చూసి అభిమానులే కాదు సెలబ్రిటీస్‌ కూడా శభాష్‌ అంటున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ పోస్టర్‌ మరీ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది. ఇదో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఫస్ట్‌లుక్‌ పోస్టరే అదిరిపోయింది. ఓ పక్క యాక్షన్‌, మరో పక్క రొమాన్స్‌.. అదరగొట్టేశాడు అఖిల్‌. కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. తొలి సినిమాలోనే అఖిల్‌ యాక్షన్‌లో కింగ్‌ అని నిరూపించేసుకున్నాడు. ఆ సినిమా విజయం సాధించకపోయినా కానీ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అఖిల్‌ సూపర్‌ అనిపించుకున్నాడు. ఈ సారి 'హలో' కోసం రూపొందించే యాక్షన్‌ సీన్స్‌ అయితే హాలీవుడ్‌ రేంజ్‌లో ఉండబోతున్నాయనీ ఫిల్మ్‌ వర్గాల సమాచారమ్‌. 

'మనం' సినిమాలో అఖిల్‌కి బీభత్సమైన ఎంట్రీ సీన్‌ క్రియేట్‌ చేశాడు డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌. జస్ట్‌ గెస్ట్‌ రోల్‌కే అంత బిల్డప్‌ ఇస్తే ఇక ఫుల్‌ లెంగ్త్‌ హీరో ఎంట్రీ సీన్‌ ఇంకెంతలా ఉండబోతోందో కదా ఈ సినిమాలో. అవును అక్కినేని ఫ్యాన్స్‌ ఫుల్‌ పండగ చేసుకునేలా ఉండబోతోందట అఖిల్‌ ఎంట్రీ సీన్‌ 'హలో'లో. కాగా ఈ సినిమా టీజర్‌ ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్‌. డిశంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS