ఎన్టీఆర్‌ కోసం అలియా వస్తుందా?

మరిన్ని వార్తలు

ఈ మధ్య బాలీవుడ్‌ భామలు టాలీవుడ్‌లో తెగ సందడి చేస్తున్నారు. తొలి ఎంట్రీతోనే మంచి సక్సెస్‌లు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఆ క్రమంలో లేటెస్టుగా కైరా అద్వానీ 'భరత్‌ అనే నేను' చిత్రంతో సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అందుకున్న సంగతి తెలిసిందే. 

ఇకపోతే తాజాగా బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ అలియా భట్‌ కూడా అతి త్వరలో టాలీవుడ్‌ ఎంట్రీకి రెడీగా ఉందని తెలుస్తోంది. అయితే తెలుగులో సినిమా అంటూ చేస్తే ఎన్టీఆర్‌తోనే చేస్తానని గతంలో చెప్పింది బ్యూటీ అలియాభట్‌. టాలీవుడ్‌ హీరోల్లో ఎన్టీఆర్‌ అంటే అలియాభట్‌కి చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో అలియా నటిస్తోందంటూ న్యూస్‌ టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిందిప్పుడు. 

ఈ సినిమాకి 'అరవింద సమేత వీర రాఘవ' అని టైటిల్‌ని ఫిక్స్‌ చేసిన సంగతి తెలిసిందే. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఇటీవలే తెలుగమ్మాయి ఇషా రెబ్బ చోటు దక్కించుకుంది. ఇషాకి ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ దక్కిందట. అయితే అలియా సంగతేంటి? అంటే, అలియాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయించబోతున్నాడు త్రివిక్రమ్‌ అంటూ ఓ గాసిప్‌ వినిపిస్తోంది. 

అయితే ఇది నిజమేనా? లేక, ఒకవేళ ఎన్టీఆర్‌ - చరణ్‌ మల్టీ స్టారర్‌తో అలియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుందా? చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS