సూర్యతో నా కెమిస్ట్రీ సూపర్బ్‌ అంటోన్న బ్యూటీ

మరిన్ని వార్తలు

ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ పండించడంలో ధిట్ట ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌. చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా సరే ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి అస్సలు అబ్జక్షన్స్‌ పెట్టదు ఈ బ్యూటీ. ఈ మధ్యనే స్టార్‌ హీరో పవన్‌ కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి'లోనూ రొమాన్స్‌ అలాగే పండించేసిందీ హాట్‌ భామ. 

సినిమా హిట్‌ అయ్యుంటే భామ రేంజ్‌ ఓ స్టేజ్‌లో ఉండేది. దురదృష్టవశాత్తూ సినిమా నిరాశ పరిచడంతో అమ్మడి దూకుడుకు కొంచెం కళ్లెం పడినట్లైంది. కానీ తాజాగా రాబోతున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లో అమ్మడి హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అంటున్నారు. హాట్‌నెస్‌ సంగతి పక్కన పెడితే, అల్లు అర్జున్‌తో ఈ భామ ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ మాటల్లో చెప్పడం కష్టమేనట. ఆల్రెడీ విడుదలైన పోస్టర్స్‌లోనే బీభత్సంగా కనిపిస్తోంది ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ. ఇక సినిమాలో కెమిస్ట్రీ ఇంకెంత హాట్‌గా ఉండబోతోందో. ఎంత హాట్‌నెస్‌ ప్రదర్శించినా, అమ్మడికి టైం కలిసి రావడం లేదు. 

వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటున్నా, హాట్‌ హాట్‌ హిట్స్‌ మాత్రం అమ్మడి ఖాతాలో పడడం లేదు. తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విషయానికి వస్తే, రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్‌గా ప్రమోషన్‌ పొంది తెరకెక్కిస్తున్న చిత్రమిది. అల్లు అర్జున్‌ సైనికుడి పాత్రలో చాలా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. లేటెస్టుగా లవర్స్‌డే సందర్భంగా 'ఫైటర్‌ ఆల్సో.. లవర్‌ ఆల్సో..' అనే సాంగ్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. మొన్నీ మధ్యన రిలీజైన 'సైనికా..' సాంగ్‌లో సైనికుడి గొప్పతనం చెబితే, ఈ లేటెస్ట్‌ సాంగ్‌లో ప్రేమికుడి గొప్పతనం చెప్పాడు బన్నీ. అలాగే అనూ ఇమ్మాన్యుయేల్‌తో ఉన్న హాట్‌ స్టిల్స్‌ కిర్రాకు పుట్టించేస్తున్నాయి. 

చూడాలి మరి అనూకి ఈ సినిమాతోనైనా చెప్పుకోదగ్గ హిట్‌ అందుతుందో లేదో. తన హాట్‌ హాట్‌ అందాలకి తగిన వేల్యూ చిక్కుతుందో లేదో!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS