బన్నీ మీదే అందాల భామ ఆశలన్నీ

By iQlik Movies - February 13, 2018 - 06:00 PM IST

మరిన్ని వార్తలు

'మజ్ను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్‌. తొలి సినిమాకే హిట్‌ కొట్టేయడంతో ఆటోమేటిగ్గా అందరి దృష్టినీ ఆకర్షించేసింది. వరుసగా యంగ్‌ హీరోస్‌తో ఛాన్సెస్‌ దక్కించుకుంటోన్న ఈ అందాల భామ ఒక్కసారిగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి' సినిమాలో నటించే మెగా ఛాన్స్‌ కొట్టేయడంతో చెప్పలేనంత క్రేజ్‌ వచ్చేసింది. 

దాంతో స్టార్‌ హీరోలు కూడా అమ్మడి కోసం క్యూ కట్టేశారు. ఆ క్రమంలోనే బన్నీ హీరోగా తెరకెక్కుతోన్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా సెటిలైపోయింది. అయితే అనూహ్యంగా 'అజ్ఞాతవాసి' దెబ్బ కొట్టడంతో అమ్మడి డిమాండ్‌ బాగా పడిపోయింది. ఇక ఆల్రెడీ సెట్స్‌ మీదున్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా సంగతి పక్కన పెడితే, ఆ తర్వాత దక్కుతాయనుకున్న బంపర్‌ ఆఫర్స్‌ అన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోయాయి. దాంతో ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ ఇప్పుడు బన్నీ సినిమా పైనే. ఈ సినిమా సక్సెస్‌ అయితేనే అనూ ఇమ్మాన్యుయేల్‌ పొలంలో మొలకలు మొలిచినట్లు. లేదంటే అంతే సంగతి అనే టాక్‌ వినిపిస్తోందిప్పుడు. 

'అజ్ఞాతవాసి' సినిమా విడుదలకు ముందు ఈ బ్యూటీ విషయంలో పెరిగిన హైప్‌ అంతా ఇంతా కాదు. అయితే ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితే క్రేజ్‌ తగ్గిపోతుందని చెప్పడం భావ్యం కాదులెండి. అయినా కానీ ఏం చెప్పగలం 'రాత్రికి రాత్రే స్టార్స్‌ అయిపోవడం సాధ్యం కాదు' అనేది ఇదివరకటి మాట. కానీ ఇప్పుడలా కాదు. ఒక్క ఐడియా జీవితానే మార్చేస్తుంది అన్నట్లుగా ఒక్క హిట్‌ లైఫ్‌ సెటిల్‌ చేసేస్తోంది ఇదీ ఇప్పటి సినిమాల పరిస్థితి. ఈ ముద్దుగుమ్మ విషయంలో అలాగే 'అజ్ఞాతవాసి' సినిమాతో వచ్చిన క్రేజ్‌ విడుదలయ్యాక రిజల్ట్‌ బెడిసి కొట్టడంతో రివర్స్‌ అయిపోయింది. 

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆన్‌ ది వేలో ఉన్న బన్నీ సినిమా పైనే అనూ ఇమ్మాన్యుయేల్‌ ఆశలు పెట్టుకోవడంలో తప్పేముంది చెప్పండి!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now