అనూ మేనియా మామూలుగా లేదు

మరిన్ని వార్తలు

ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్మోగిపోతున్న ముద్దుగుమ్మ పేరు అనూ ఇమ్మాన్యుయేల్‌. 'మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ దూకుడుకు బ్రేకే లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోస్‌తో ఛాన్సెస్‌ దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌ ఛైర్‌ వైపు సూపర్‌ ఫాస్ట్‌గా దూసుకొచ్చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌ అంటే అనూ ఇమ్మాన్యుయేల్‌ అనే చెప్పాలి. 

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చేతిలో స్టార్‌ మూవీస్‌ మెండుగా ఉన్నాయి. అందులో పవన్‌ కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న 'అజ్ఞాతవాసి' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉండగా, అల్లు అర్జున్‌ సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' షూటింగ్‌ దశలో ఉంది. వక్కంతం వంశీ ఈ సినిమా దర్శకుడు. నాగచైతన్యతోనూ ఓ సినిమాలో నటిస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. ఇటీవలే గోపీచంద్‌ 'ఆక్సిజన్‌'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఇప్పుడు చరణ్‌ - బోయపాటి కాంబినేషన్‌లో రాబోయే సినిమా కోసం కూడా ఈ ముద్దుగుమ్మనే ఎంచుకున్నారనీ సమాచారమ్‌. 

ఇదిలా ఉండగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న చరణ్‌ - తారక్‌ మల్టీ స్టారర్‌లోనూ ఈ బ్యూటీనే హీరోయిన్‌ అనే ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్‌కి ప్రెజెంట్‌ ఫస్ట్‌ ఆప్షన్‌ అనూనే అనేంతగా మారిపోయింది. ఎటు నుండి ఎలా చూసుకున్నా కానీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ ది బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది మన దర్శక, నిర్మాతలకు. అందానికి అందం, అభినయానికి అభినయం. ఇక గ్లామర్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇంతకన్నా హీరోయిన్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్‌ ఇంకేంటి. అయితే టైం కూడా కలిసి రావాలిలెండి. 

ఆ లక్కీటైం ప్రస్తుతం అనూ చుట్టూ వైఫైలా ఉంది. టైం కలిసొస్తే, సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఆఫర్స్‌ మీద ఆఫర్స్‌ వచ్చి పడుతుంటాయి. సో అలా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS