అనుపమ అదరగొట్టేసింది

మరిన్ని వార్తలు

అనుపమ పరమేశ్వరన్‌. 'అ,ఆ..' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే హిట్‌ అందుకుంది. ఆ సినిమాలో అనుపమది చాలా చిన్న పాత్రే అయినా కానీ మంచి పేరు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజా చిత్రం 'శతమానం భవతి'. శర్వానంద్‌కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా నటిస్తోంది అనుపమా. అమెరికా నుండి వచ్చిన అమ్మాయిగా చాలా మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తూనే ట్రెడిషనల్‌గానూ కనిపిస్తోంది. ట్రైలర్‌లో ఆమె ప్రెజెన్స్‌ చాలా చాలా బాగుంది. అమెరికా అమ్మాయిగా మెప్పిస్తూనే, లంగా ఓణీలో కూడా మెరిపిస్తోంది. కళ్లతోనే అన్ని భావాలను అంతందంగా పలికించేస్తోంది అనుపమా పరమేశ్వరన్‌. ఇకపోతే శర్వానంద్‌. ఈ యంగ్‌ హీరో నటన గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఏ రకమైన పాత్రనైనా టేకప్‌ చేయగల టాలెంట్‌ ఉంది శర్వానంద్‌కి. ఈ సినిమాతో తొలిసారిగా శర్వానంద్‌ గోదావరి జిల్లా యాసతో మెప్పించాడు. ఆ యాస శర్వానంద్‌కి చాలా బాగా సెట్‌ అయిపోయింది. ఇక శర్వానంద్‌కి తాత గెటప్‌లో ప్రకాష్‌రాజ్‌ అద్భుతంగా ఉన్నారు. ప్రకాష్‌రాజ్‌ తన అనుభవంతో ఈ పాత్రకి చాలా వెయిట్‌ తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఆయనకు జోడీగా జయసుధ చాలా నేచురల్‌గా కనిపిస్తున్నారు. ఓ పక్క పాత్రల ఎంపిక, మరో పక్క విజువల్‌గా పల్లెటూరి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇద్దరు పెద్ద హీరోలకు పోటీగా ఈ సినిమాను రేస్‌లో ఉంచారంటేనే తెలుస్తోంది సినిమాపై ఎంత నమ్మకముందో! గతేడాది కూడా ఇలాగే సైలెంట్‌గా వచ్చి హిట్‌ పట్టుకెళ్లిపోయాడు శర్వానంద్‌. ఈ సారి కూడా శర్వానంద్‌కి విజయం పక్కా అని ట్రేడ్‌ వర్గాలు తేల్చేశాయి. 


 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS