అనుపమ క్యూట్‌గా ఎట్రాక్ట్‌ చేసేసింది

మరిన్ని వార్తలు

'శతమానం భవతి' సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌. బాగా ఎట్రాక్ట్‌ చేసేస్తోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా రెండు భారీ సినిమాలతో పోటీ పడి నిలిచింది. సంక్రాంతి పండగకి సరైన సినిమాగా మంచి పేరుతో దూసుకెళ్లిపోతోంది. ఇకపోతే హీరోయిన్‌గా నటించిన అనపమా గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఈ సినిమాతో ఈ క్యూట్‌ బేబీకి, ఇంతవరకూ ఉన్న పేరు రెట్టింపయ్యింది. ఇంతవరకూ అనుపమా తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. నితిన్‌ హీరోగా వచ్చిన 'అ,ఆ..'తో పరిచయమైంది. కానీ ఆ సినిమాలో సమంత మెయిన్‌ హీరోయిన్‌ కాగా, రెండో హీరోయిన్‌గా మాత్రమే అనుపమ నటించింది. అయినా కానీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇకపోతే రెండో సినిమా చైతూ హీరోగా వచ్చిన 'ప్రేమమ్‌'. ఈ సినిమాలో ముగ్గురు భామల్లో ఒకరిగా అనుపమ నటించింది. అలాగయినా మంచి మార్కులే కొట్టేసింది. తొలిసారిగా మెయిన్‌ రోల్‌లో నటించిన సినిమా ఇదే కావడంతో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ హీరోయిన్‌గా తన తడాఖా చూపించేసింది ఈ సినిమాలో అనుపమ. అంతేకాదు కొత్త సంవత్సరంలో ఇంతవరకూ విడుదలైన రెండు భారీ సినిమాల్లోనూ ఇద్దరు సీనియర్‌ హీరోయిన్లు కాజల్‌, శ్రియ నటించారు. అయితే మెగాస్టార్‌ ముందు కాజల్‌ తేలిపోగా, బాలయ్య నటన ముందు శ్రియ తేలిపోయింది. కానీ శర్వానంద్‌తో జోడీ కట్టిన అనుపమా మాత్రం హీరోకి పోటీగా నటించి మెప్పించింది. దాంతో అనుపమా, కాజల్‌, శ్రియలతో పోల్చితే యాక్టింగ్‌ స్కోప్‌ పరంగా గ్రేట్‌ అంటున్నాయి సినీ వర్గాలు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS