ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- బాహుబలి 2

మరిన్ని వార్తలు

మొన్న విడుదలై ప్రపంచ సినిమాని తెలుగు చలనచిత్ర పరిశ్రమ వైపు తిప్పిన మేటి చిత్రం- బాహుబలి 2.

ఈ సినిమాకి విడుదల ముందు ప్రేక్షకులు ఈ చిత్రం హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది పట్టించుకోకుండా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తితో చూడడమే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే, ఆడియన్స్ ఏమాత్రం నిరాశ చెందకుండా కథను అల్లిన విధానం ప్రేక్షకులని తమ సీట్లకి అత్తుకుని ఉండేలా చేసింది.

ఇక అనుష్క, ప్రభాస్ ల నటన బాహుబలి2 మొత్తానికి హైలైట్ గా నిలిచింది. విడుదలైన మొదటిరోజే రూ 100 కోట్లు పైగా వసూళ్ళు సాదించి ఏ భారతీయ చలనచిత్రం అందుకొని గొప్ప ఫీట్ సాదించింది.

ఈ చిత్రం రూ 1000కోట్లు మార్క్ దాటుతుంది అనే అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ 200 కోట్ల వరకు కలెక్ట్ చేయడంతో రూ 1000 కోట్ల మార్కు దాటడం పెద్ద సమస్య కాదనిపిస్తుంది.

మొత్తానికి రాజమౌళి తెలుగు వాళ్ళు అందరు తలెత్తుకునేలా బాహుబలి రూపొందించారు. ఇక ఈ చిత్ర కలెక్షన్స్ కి రాబోయే చిత్రాలతో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది ట్రేడ్ వర్గాల సమాచారం.

అందరి అంచనాలను దాటేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కి ఇంతటి గుర్తింపు తెచ్చిన బాహుబలి చిత్రమే ఈ వరం మన ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS