58 ఏళ్ల హీరోయిన్‌

By iQlik Movies - January 11, 2017 - 04:03 AM IST

మరిన్ని వార్తలు

జయసుధ. సహజ నటిగా పేరు తెచ్చుకున్న ఈమె క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక పాత్రలను అవలీలగా నటించేస్తున్నారు. కాదు కాదు జీవించేస్తున్నారు. అలనాడు వయసులో ఉన్నప్పుడు హీరోయిన్‌గా తన హవా చూపించారు. ఇప్పుడు తల్లిగా, అక్కగా, వదినగా పలు రకాల పాత్రల్లో తనదైన మెజార్టీ ఇస్తున్నారు పాత్రకి. తొలిసారిగా ఆర్‌ నారాయణమూర్తి సినిమాలో నటిస్తున్నారు తాజాగా జయసుధ. అదే 'హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య'. మామూలుగా నారాయణ మూర్తిగారి సినిమా అంటే విప్లవాలు, మెసేజ్‌లు ఇలా సామాజిక నేపధ్యంలో సాగుతాయి. కానీ ఆయన తొలిసారిగా ఓ కమర్షియల్‌ చిత్రంలో నటించడం. అందులో జయసుధ ఆయనకి జోడీగా నటించడం జరుగుతోంది ఈ సినిమా ద్వారా. ఈ సినిమాలో వెంకట్రామయ్య హీరో అంటే, ఆయనకి జంటగా నటిస్తున్న జయసుధ హీరోయినే కదా. అలా ఏభై ఎనిమిదేళ్ల వయసులో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది జయసుధకి. ఈ అవకాశం ఏ ఒక్కరికీ రాదనీ, ఈ అవకాశం వచ్చిన తానెంతో అదృష్టవంతురాల్ని అంటోంది జయసుధ. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అంతేకాదు మరో సినిమా 'శతమానం భవతి' కూడా సంక్రాంతికే విడుదల కానుంది. శర్వానంద్‌ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో జయసుధ, ప్రకాష్‌రాజ్‌ జోడీ కనువిందు చేయనుంది. ఈ జంట ఆల్రెడీ 'గోవిందుడు అందరివాడేలే' సినిమా ద్వారా ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. అంతకు మించిన కీలకపాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారట. సో ఈ సంక్రాంతి జయసుధకి చాలా ప్రత్యేకం అని చెబుతోంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now