తప్పు చేయాలంటే భయపడాలంటోన్న బెల్లంకొండ

మరిన్ని వార్తలు

ఇంతవరకూ 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జయ జానకి నాయకా' చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. సూపర్‌ యాక్షన్‌ చేయగల కటౌట్‌ బెల్లంకొండది. డాన్సుల్లోనూ దిట్టే. హీరోగా ఉండాల్సిన అన్ని పాళ్లూ సమంగా ఉన్న కత్తిలాంటి కుర్రోడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తాజాగా శ్రీవాస్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదో ప్రయోగాత్మక చిత్రమంటున్నారు చిత్ర యూనిట్‌. తప్పు చేస్తే మన అంతరంగమే మనల్ని శిక్షిస్తుంది. అందుకు పంచభూతాలూ తోడవుతాయి అనే ఓ కొత్త కాన్సెప్ట్‌ని ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యత ఉంటుందట ఈ సినిమాలో. ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్‌గా ఇంతవరకూ గ్లామరస్‌ పాత్రల్తో క్యూట్‌ అండ్‌ హాట్‌గా మెప్పించిన పూజా నటనకి ప్రాధాన్యత ఉన్న సినిమాలో నటించబోతోంది ఈ సినిమా ద్వారా. ఎలాంటి ఎమోషన్‌ అయినా పండించగల సత్తా ఉంది ఈ ముద్దుగుమ్మలో. కానీ ఇంతవరకూ ఆ అవకాశమే రాలేదు. ఈ సినిమాతో తన టాలెంట్‌ చూపిస్తానంటోంది. ఈ సినిమాకి 'సాక్ష్యం' అనే టైటిల్‌ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. హీరోగా బెల్లంకొండలోని కొత్త యాంగిల్‌ ఈ సినిమా ద్వారా బయటికి రాబోతోందట. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథానాయకుడిగా నటించడం తనకి చాలా సంతృప్తినిస్తోందంటున్నాడు బెల్లంకొండ. ఇంతవరకూ తాను చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. ఈ సినిమా ఒక్కటీ ఒక ఎత్తు. కొత్తగా చేస్తున్న ఈ ప్రయోగం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందనీ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు బెల్లంకొండ. మొత్తానికి ఈ సినిమాతో ఏదో కొత్తదనం చూపిస్తాననే అంటున్నాడు మన స్పీడున్నోడు. అదేంటో చూడాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS