ADA

2016 పక్కా లోకల్‌ : పేలిన ఐటెం బాంబ్‌

By iQlik Movies - December 30, 2016 - 03:47 PM IST

మరిన్ని వార్తలు

వామ్మో! ఐటెం సాంగా? నో అంటే నో. హీరోయిన్‌గా ఛాన్సెస్‌ లేకపోతే ఖాళీగా అయినా ఉంటాను కానీ ఐటెం సాంగ్‌లో మాత్రం నటించను అన్న ముద్దుగుమ్మ కాజల్‌, ఈ ఏడాది ఆ అద్భుతానికి తల వంచి తీరాల్సి వచ్చింది. వంచితే వంచింది కానీ వెనక్కి తిరిగి చూడలేని సక్సెస్‌ని అందుకుంది. సాంగ్‌ ఒక్కటే. కానీ సినిమా మొత్తానికి ఆ సాంగ్‌తో వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. 'జనతా గ్యారేజ్‌' సినిమాలో కాజల్‌ ఐటెం సాంగ్‌లో నటించింది. వాస్తవానికి ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్‌ ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటించారు. ఈ ఇద్దరికీ రాని పేరు జస్ట్‌ ఐటెం సాంగ్‌లో నటించిన కాజల్‌కి దక్కింది. అప్పుడే అర్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మకి ఐటెం సాంగ్‌ పవర్‌ ఏంటో! నేను పక్కా లోకల్‌ అంటూ సాగే ఆ పాటలో కాజల్‌ తన అందంతో ఫ్యాన్స్‌కి కిర్రాక్‌ పుట్టించింది. సినిమా సక్సెస్‌లో ఈ పాట మెయిన్‌ పార్ట్‌ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సాంగ్‌ ఈ ఏడాది నెంబర్‌ వన్‌ ఐటెం సాంగ్‌ అయ్యింది. అంతేకాదు నో నో అంటూ వచ్చిన కాజల్‌ కెరీర్‌లోనే ఈ సాంగ్‌ ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అయ్యి కూర్చుంది. ఈ సాంగ్‌ సక్సెస్‌ తర్వాత కాజల్‌ ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా గోల్డెన్‌ ఛాన్స్‌ దక్కించేసుకుంది. 


ఇకపోతే కాజల్‌ హీరోయిన్‌గా ఈ ఏడాది తెలుగులో రెండు పెద్ద సినిమాల్లో నటించింది. అందులో ఒకటి మహేష్‌బాబుతో నటించిన 'బ్రహ్మూెత్సవం' సినిమా. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఎంతో కలర్‌ ఫుల్‌గా విడుదలయ్యింది ఈ సినిమా. విడుదలకు ముందే ఎన్నో భారీ అంచనాలు ఈ సినిమాకి. ఎందరో సీనియర్‌ నటీ,నటులు, కాజల్‌తో పాటు సమంత, ప్రణీత వంటి ముద్దుగుమ్మలు కూడా నటించారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా ఈ ఏడాదికే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక రెండో సినిమా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వచ్చిన 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' సినిమా. 'గబ్బర్‌ సింగ్‌' సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్‌ చాలా అందంగా ముద్దుగా, బొద్దుగా కనిపించింది. కానీ ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు కాజల్‌కి. తొలిసారిగా పవన్‌తో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో. ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ విజయం మాత్రం దరి చేరలేదు. సరిగ్గా ఇదే టైంలో తన కోసమే అన్నట్లుగా వచ్చిన 'నేను లోకల్‌' ఐటెం సాంగ్‌ కాజల్‌ని నిలబెట్టేసింది. పై రెండు సినిమాల పరాజయానికి పక్కా విరుగుడు అన్నట్లుగా ఈ సాంగ్‌ ఈ ఇయర్‌ టాప్‌ ఆఫ్‌ ది ఐటెంగా నిలిచింది. దాంతో ఆమె పేరు టాలీవుడ్‌ అంతా మార్మోగిపోయింది. ఇయర్‌ ఎండింగ్‌లో వచ్చినా కానీ, ఫస్ట్‌ ఐటెం సాంగ్‌తో దుమ్ము దులిపేసింది. ఇదీ ఈ ఇయర్‌ ఐటెం ఆఫ్‌ ది కాజల్‌ స్టోరీ. 


iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS
Loading...
Loading...

AD

Baahubali 2 Telugu Movie

AD

Coffee with Pulla Ice Telugu Short Film 2017

AD

We are Hiring - Content Writer