మహేష్ 'భరత్ అనే నేను' స్టొరీ లీక్..!

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రానికి సంబందించిన తొలి టీజర్ ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదకానుంది. ఈ తరుణంలో ఈ చిత్రానికి సంబందించిన కథ లీక్ అయిందంటూ ఇప్పుడు ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది.

ఆ వార్త ప్రకారం - భరత్ అనే నేను చిత్రంలో రచయిత - దర్శకుడు అయిన కొరటాల శివ ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థ లోసుగులని ఎత్తి చూపిస్తున్నట్టు ఆ వార్త సారాంశం. అయితే చాలా మంది మాత్రం సమాజంలో ఉన్న అవినీతి - అక్రమాలపై ఈ చిత్రం రూపొందించారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ రెండింటిలో ఏది నిజమైంది అనేది ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదలయ్యే టీజర్ తో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కైరా అద్వాని ప్రధాన పాత్రలో కనిపిస్తున్నది, దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

ఇంకొన్ని గంటలు ఆగితే 'భరత్ అనే నేను' కథ ఏమిటి అనేది పూర్తిగా తెలిసే అవకాశం ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS