ADA

నిజమైతే.. చరణ్‌ గ్రేటే

By iQlik Movies - January 10, 2017 - 03:10 PM IST

మరిన్ని వార్తలు

చరణ్‌ ప్రస్తుతం 'ధృవ' సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. మరో పక్క నాన్న చిరంజీవి 150వ సినిమా ప్రమోషన్స్‌లో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జనాల్లోకి వెళ్లగానే చరణ్‌ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. చరణ్‌ కోసం ఇప్పుడు ప్రస్తుతం క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రెడీగా ఉన్నాడు. రేపో మాపో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. అయితే చరణ్‌ తాజాగా మరో సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అది రొమాంటిక్‌ డైరెక్టర్‌ మణిరత్నంతో. ప్రస్తుతం మణిరత్నం అంత సక్సెస్‌లో లేడు. కానీ ఆయన దర్శకత్వంలో నటిస్తే ఏ హీరో అయినా నటనలో రాటు దేలుతాడు. అందుకే ఆయన డైరెక్షన్‌లో నటించాలన్నది ప్రతీ హీరోకీ, హీరోయిన్‌కీ ఓ కల. ఇప్పుడు ఆ ఛాన్స్‌ చరణ్‌కి వచ్చినట్లే కనిపిస్తోంది. గతంలో 'ఆరెంజ్‌'తో ప్యూర్‌ లవ్‌స్టోరీ అంటూ డిఫరెంట్‌ అటెంప్ట్‌ చేశాడు చరణ్‌. కానీ అది బెడిసికొట్టింది. అనుకున్నంత సక్సెస్‌నివ్వలేదు. ఆ తర్వాత డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో 'ధృవ'ని టేకప్‌ చేశాడు. ఈ కొత్త ప్రయోగంతో సక్సెస్‌ అయ్యాడు. 'ధృవ' ఇచ్చిన స్ఫూర్తితో మళ్లీ ప్రయోగం చేయడానికి చరణ్‌ ప్లాన్‌ చేస్తున్నాడనిపిస్తోంది. అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్‌లో సినిమా ఈ ఏడాదిలోనే సెట్స్‌ మీదికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. 'ధృవ' సినిమాతో చరణ్‌లోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేసిన చరణ్‌, మణిరత్నం సినిమాతో తన నటనలో ఇంకేం వేరియేషన్‌ చూపిస్తాడో చూడాలిక. 

 


iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

AD

Duvvada Jagannadham Telugu Movie

AD

We are Hiring - Content Writer

AD

Ninnu Kori Telugu Movie