మెగాస్టార్‌ 'దంగల్‌'తో పోల్చేశాడు 'గురు'

మరిన్ని వార్తలు

ఇటీవల వచ్చిన అమీర్‌ ఖాన్‌ సినిమా 'దంగల్‌' మంచి విజయం అందుకుంది. విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగులో ఈ సినిమాని 'యుద్ధం' పేరుతో విడుదలైంది. ఈ సినిమా చూసి ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకు రావు అంటూ పలువురు చర్చించుకున్నారు. అలాంటిది తాజాగా వెంకీ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'గురు' సినిమాని మెగాస్టార్‌ 'దంగల్‌' చిత్రంతో పోల్చి ప్రశంసలు కురిపించేశారు. ఇంతకన్నా మెగా ప్రశంస ఇంకేముంటుంది ఈ సినిమాకి చెప్పండి. 'ఈ సినిమాని ఇంకా ఎవ్వరూ చూడలేదు కదా.. కానీ నేను చూశాను. సో నేనే ఈ సినిమాకి ఫస్ట్‌ ఆడియన్‌ని.. ఈ సినిమా నాకు చాలా చాలా నచ్చేసింది..' అంటూ చిరంజీవి బోలెడన్ని కాంప్లిమెంట్స్‌ ఇచ్చేశారు. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగాది సందర్భంగా బుల్లితెర మెగా షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంకి వెంకటేష్‌ స్పెషల్‌ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ ప్రోగ్రాంలో చిరంజీవి వెంకటేష్‌ని ఈ సినిమానుద్దేశించి ఆయన అనుభవాలను ఆడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ సినిమాలో వెంకటేష్‌ పాత్ర చాలా బాగుందన్నారు. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో వెంకీ చాలా కొత్తగా కనిపిస్తున్నారనీ చిరు అన్నారు. అలాగే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చిరంజీవి అన్నారు. రితికా సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS