మెగా అల్లుడికి హీరోయిన్ దొరికేసింది

మరిన్ని వార్తలు

మెగా అల్లుడు కళ్యాణ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమాకి సంబందించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ సరసన నటించేందుకు హీరోయిన్ ని ఎంపిక చేశారట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు నితిన్ తో లై సినిమాలో నటించిన మేఘా ఆకాష్. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది, ఇక ఈ అవకాశంతో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి జత కలిసే చిత్రాన్ని తీసిన రాకేశ్ శశి దర్శకత్వం వహించనున్నాడు.

వారాహి చలనచిత్ర సంస్థ పైన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. చూద్దాం.. మేఘా ఆకాష్ కి ఈ అవకాశం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS