ఉయ్యాలవాడ అప్‌డేట్స్‌ ఎప్పుడు?

మరిన్ని వార్తలు

తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. వస్తూ వస్తూనే సెన్సేషనల్‌ హిట్‌ కొట్టి, రికార్డులు తిరిగ రాసేశారు. అరతే జోరుతో వరస పెట్టి సినిమాలు చేస్తారని ఫ్యాన్స్‌ భావించారు. ఆల్రెడీ చిరు కోసం చాలా మంది డైరెక్టర్లు కథలు సిద్ధం చేసుకుని ఉన్నారు కూడా. అయితే తర్వాత చిరంజీవితో సినిమాని తెరకెక్కించే అరుదైన అవకాశం డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి కొట్టేశాడు. చిరంజీవితో చారిత్రాత్మక చిత్రం 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' జీవిత గాథని తెరకెక్కించబోతున్నారు సురేందర్‌ రెడ్డి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం సమాచారం ఏమీ లేదు. అయితే ఓ ప్రత్యేక టీమ్‌ ఈ సినిమా కోసం కసరత్తులు చేస్తోందన్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తోంది. మార్చిలోనే ఈ సినిమాకి సంబంధించి అప్‌ డేట్స్‌ రావాల్సి ఉంది. అయితే లేటయ్యింది. టోటల్‌గా స్టోరీ ఫైనల్‌ చేసి, కాస్టింగ్‌ కూడా ప్రిపేర్‌ అయినాకనే అప్‌డేట్స్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా రామ్‌ చరణ్‌ నిర్మాణంలోనే తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఏ ముద్దుగుమ్మని వరించనుందో తెలియాల్సి ఉంది. అనుష్క, నయనతార తదితర సీనియర్‌ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పలువురు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు కూడా ఈ లిస్టులో ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS