పవన్ కళ్యాణ్ సినిమాలకి 'NO' చెప్పడానికి కారణం ఇదేనా!

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది అంటే 2019వరకు సినిమాలు చేయకూడదు అన్న నిర్ణయానికి రావడం దానిని మీడియా మిత్రులతో పంచుకోవడం కూడా జరిగిపోయింది. 

ఇక ఈయన పూర్తిగా సినిమాల నుండి VRS తీసుకున్నాడా అంటే కాదు అనే అంటున్నాయి పవన్ సన్నిహిత వర్గాలు. ఎందుకంటే ఇప్పటినుండి వచ్చే ఎన్నికల వరకు తన జనసేన పార్టీ తరపున వివిధ కార్యక్రమాలు, ఎన్నికల రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించే అవసరం ఉండడంతో సినిమాలకి తాత్కాలిక విశ్రాంతి ప్రకటించాడు అని తెలుస్తుంది. 

ఎన్నికలు అయిపోయాక ఒకవేళ రాజకీయంగా ముఖ్య భూమిక లేని పక్షంలో మళ్ళీ సినీ రంగం వైపు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు అభిప్రాయపడొచ్చు. ఇవ్వని పక్కనపెడితే, ఆయన తన ఆదాయ వనరుల కోసం సినిమా రంగం తప్ప వేరే ఏ రంగంలోనూ ప్రవేశం లేని కారణంగా ఆయన సినిమాల నుండి ఎప్పటికి VRS తీసుకోడు అన్నది నిశితాభిప్రాయం అయితే ఎక్కువమందిలో ఉంది.

ఇక దీన్నిబట్టి ఒక రెండు ఏళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ వెండితెర పైన కనిపించకపోవచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS