'మహానటి'లో జెమినీ గణేశన్‌ సూపర్బ్‌

మరిన్ని వార్తలు

అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా 'మహానటి'. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రలో టైటిల్‌ రోల్‌ పోషిస్తోంది. నటిగా ఆమె జీవితంలో ఎదుర్కొన్న ప్రధానమైన సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారు. నటిగా ఆ స్థాయిలో గుర్తింపు సాధించడానికి ఆమె జీవితంలో చాలా మంది పాత్ర కీలకమన్న సంగతి తెలిసిందే. వారిలో ముఖ్యమైన పాత్ర పోషించింది జెమినీ గణేశన్‌. రియల్‌ లైఫ్‌లో సావిత్రికి భర్త జెమినీ గణేశన్‌. రీల్‌ లైఫ్‌ జెమినీ గణేశన్‌ పాత్రలో సీనియర్‌ నటుడు ముమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నాడు. జెమినీ గణేశన్‌ జయంతి సందర్భంగా ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఆ లుక్‌లో దుల్కర్‌ సల్మాన్‌ కరెక్ట్‌గా సెట్‌ అయిపోయాడు. 'ఉన్నది ఒక జన్మైతే..' అనే క్యాప్షన్‌తో ఈ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ క్యాప్షన్‌ ఒకింత ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తోంది. ఆల్రెడీ మహానటి పాత్రలో కీర్తి సురేష్‌ ఫస్ట్‌లుక్‌ గతంలోనే విడుదలయ్యింది. ముద్దుగుమ్మ సమంత ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సావిత్రికి అత్యంత సన్నిహితురాలు, తోటి నటి అయన జమున పాత్రలో సమంత నటిస్తోంది. కీర్తి సురేష్‌కి, ఈ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోతుందంటున్నాయి సినీ వర్గాలు. అలాగే దుల్కర్‌ సల్మాన్‌కి కూడా. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేసే అవకాశాలున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS