ఫ్యామిలీ కావాలంటున్న కపిల్ శర్మ

మరిన్ని వార్తలు

ప్రముఖ కమెడియన్, యాంకర్ అయిన కపిల్ శర్మ తన కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మ షోతో ఎంతటి పాపులారిటీ సంపాదించాడో చెప్పలేం. అలాగే ఆ ఫాలోయింగ్ తో ఆయన సినిమాల్లో కూడా అడుగుపెట్టేసాడు. 

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కపిల్ శర్మ నిర్వహిస్తున్న షోని సోనీ టీవీ వారు నిలిపివేయడం జరిగింది. కపిల్ శర్మ తన కో-కమెడియన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించడమే దీనికి కారణమంటూ పుకార్లు షికారు చేశాయి. ఇవ్వన్ని పక్కకి పెడితే ఆయన నిర్వహిస్తున్న షో ఆగిపోవడం పెనుసంచలనమే అయింది. 

ఇదిలావుండగా రెండు రోజుల క్రితమే ఆయన మళ్ళీ ఒక కామెడీ షోకి ప్లాన్ చేసినట్టు ఆ షోని సోనీ వారే ప్రసారం చేయబోతున్నట్టు ప్రకటన రావడం, ఆ టీజర్ కూడా బయటకి వచ్చింది. 

ఇక ప్రస్తుతానికి ఆ షోకి ఫ్యామిలీ విత్ కపిల్ శర్మ అని అనుకుంటున్నట్టుగా యూనిట్ వర్గాల సమాచారం. మొత్తానికి కపిల్ శర్మ మళ్ళీ తనదైన శైలిలో కామెడీని పండించబోతున్నాడు అన్నది నిర్వివాదాంశం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS