గరుడవేగ సినిమా కలెక్షన్స్ ఇవే

మరిన్ని వార్తలు

రాజశేఖర్ లో ఇంకా మునపటి పదును తగ్గలేదు అని నిరూపించిన చిత్రం గరుడవేగ. ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయిన రోజు నుండే ప్రేక్షకులందరికీ ఈ సినిమా పట్ల ఆసక్తి మొదలైంది.

ఇక ఈ చిత్రానికి విడుదలైన మొదటిరోజు నుండే సూపర్ హిట్ టాక్ రావడం ఒకరకంగా చెప్పాలంటే ప్రేక్షకులు గరుడ వేగకి బ్రహ్మరధం పట్టారు అని చెప్పొచ్చు. ప్రేక్షకుల ఈ సినిమాని ఎంతగా ఆదరించారు అనేది ఇప్పుడు గరుడ వేగ నమోదు చేసిన కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది.
గరుడ వేగ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ 22కోట్లు పైగా వసూళ్ళు సాధించడంతో ఈ సినిమా ఈ సంవత్సరపు హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.  

ఇదిలావుండగా ఈ సినిమాని రూ25-రూ30 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించారు అని నిర్మాతలు తెలిపిన నేపధ్యంలో ఈ అంకెలు గరుడవేగని విజయవంతమైన చిత్రాల సరసన నిలబెట్టేసింది.

మొత్తానికి రాజశేఖర్ ఈ చిత్రంతో చాలాకాలం తరువాత హిట్ సాధించాడు అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS