శాతకర్ణికి నో కటింగ్స్‌

మరిన్ని వార్తలు

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాకి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక్క కటింగ్‌ కూడా లేకుండా సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ ఇచ్చింది ఈ సినిమాకి. అయితే ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు ఎక్కువ కనుక యు/ఎ సర్టిఫికేట్‌ ఇచ్చింది. లేదంటే క్లీన్‌ యు సర్టిఫికేట్‌ ఇచ్చి ఉండేది. అయినా కానీ రికార్డు స్థాయిలో ఇంత గొప్ప సినిమాని తెరకెక్కించనందుకు చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపింది సెన్సార్‌ బోర్డు. తెలుగులో ఇంతవరకూ ఎవరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌ ఇది. క్రిష్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా టేకప్‌ చేసిన సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే క్రిష్‌ పెళ్లి జరిగింది. అయినా కానీ షూటింగ్‌కి ఏమాత్రం ఇబ్బంది కలగనీయకుండా అనుకున్న టైంకే సినిమాను పూర్తి చేశాడు క్రిష్‌. ఈ సినిమాకి బడ్జెట్‌ కూడా చాలా తక్కువ. పరిమితులు మించిపోకుండా అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాని ముగించాడు. తక్కువ బడ్జెట్‌లో అయినా కానీ సినిమా విజువల్‌గా చాలా బాగా వచ్చిందంటూ సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారు. బాలయ్యకి వందో చిత్రం కావడంతో ఈ సినిమాని చాలా పట్టుదలగా భావించారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సంక్రాంతి బాలయ్యకు వెరీ వెరీ స్పెషల్‌. సంక్రాంతికి విడుదలైన చాలా సినిమాలు బాలయ్యకి విజయాన్ని తెచ్చిపెట్టాయి. అలాగే ఈ సినిమాకి కూడా భారీగా అంచనాలున్నాయి. అంతేకాదు చాలా ప్రత్యేకతలతో కూడుకున్న చిత్రం కూడా కావడంతో అంచనాలు మరిన్ని ఉన్నాయి ఈ సినిమాకి. 

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS