ఆర్జీవీ God Sex Truth ట్రైలర్ టాక్

మరిన్ని వార్తలు

రామ్‌గోపాల్‌ వర్మ - 'సంచలనాన్ని' ఇంటి పేరుగా మార్చేసుకున్న సినీ ప్రముఖుడు. వర్మ పేరే ఓ సంచలనం అనేంతలా ఆయన ఏం చేసినా అది సంచలనమవుతుంది. ఏదన్నా సినిమా అనౌన్స్‌ చేసినా, ఏదన్నా సినిమా మీద ఆయన కామెంట్‌ వేసినా, ఏ అంశం మీద ఆయన స్పందించినా ప్రతి ఒక్కటీ సంచలనమే. అందుకే ఆయన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సినిమాకి కొత్తదనం అందించడం 

'శివ'తో ప్రారంభించిన వర్మ, ఆ కొత్తదనం కోసం ఎప్పటికప్పుడు పరితపిస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం కన్పిస్తుంటుంది జయాపజయాలతో సంబంధం లేకుండా. అదీ రామ్‌గోపాల్‌ వర్మ అంటే. 'ఫారినర్‌' పేరుతో షార్ట్‌ ఫిలిం తీసినా, గన్స్‌ అండ్‌ థైస్‌ అంటూ వెబ్‌ సిరీస్‌ షురూ చేసినా అది వర్మకే చెల్లింది. తాజాగా వర్మ పోర్న్‌స్టార్‌ మియా మల్కోవాతో ఓ వీడియో షూట్‌ తీశారు. అదేంటి? ఎలా ఉండబోతోంది? అనే అంశాలకు సంబంధించి 'జిఎస్‌టి' (గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌) టీజర్‌ విడుదల చేశారు. ఇందులో వర్మ చెప్పదలచుకున్నది సుస్పష్టం. సెక్స్‌ గురించే ఆయన చెప్పదలచుకున్నారు. చెప్పాల్సింది చెప్పేశారు. 

ప్రపంచ ప్రముఖులు సెక్స్‌ గురించి ఏమేం చెప్పారో, ఆ కోట్స్‌ అన్నిటినీ వీడియోలో పొందు పర్చారు. మామూలుగా పోర్న్‌స్టార్‌తో వీడియో షూట్‌ అనగానే, చాలా చాలానే అనుకుంటాం. అలాంటివన్నీ టీజర్‌లో దాదాపుగా చూపించేశారు వర్మ. అదీ కళాత్మకంగా. అదే వర్మ ప్రత్యేకత. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకూ మియా మల్కోవా న్యూడ్‌గానే ఉంది. అయితే ఆ న్యూడిటీనీ అత్యంత కళాత్మకంగా చూపడంలో వర్మ సక్సెస్‌ అయ్యారు. అయితే 'ప్రైవేట్‌ పార్ట్స్‌' ఏవీ ఈ వీడియోలో కన్పించలేదు. కానీ 'షూట్‌' టైమ్‌ ఫొటోల్ని మియా మల్కోవా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన తీరు చూస్తే, ఆ ప్రైవేట్‌ పార్ట్స్‌ కూడా ఫుల్‌ వీడియోలో ఉండే అవకాశముంది. 

సంగీత మాంత్రికుడు ఎంఎం క్రీమ్‌ (అదేనండీ మన కీరవాణి) బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, మియా మల్కోవా మాటలు ఇవన్నీ ఈ వీడియోలో ఇతర ప్రధాన ఆకర్షణలు. జిఎస్‌టి టీజర్‌లో వర్మ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ గురించే చూపించాడు, అదే 'గాడ్‌' అనుకోవాలేమో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS