టీవీ బ్యూటీకి చెక్‌ చెప్పిన మిర్చి బ్యూటీ

మరిన్ని వార్తలు

ప్రబాస్‌ హీరోగా వచ్చిన 'మిర్చి' సినిమాతో హంసా నందిని ఐటెం అవతారమెత్తింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కానీ అమ్మడికి ఐటెం గాళ్‌గా వచ్చిన పేరు హీరోయిన్‌గా రాలేదు. ఐటెం సాంగ్‌తో వస్తూ వస్తూనే అదరగొట్టేసింది. సినిమా సూపర్‌ హిట్‌. అందులో హంసా సాంగ్‌ అంతకన్నా పెద్ద హిట్‌ అయ్యింది. అలాగే వరుసగా భారీ ఆఫర్లు దక్కించుకుంది. 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ సరసన స్పెషల్‌ సాంగ్‌లో చిందేసింది. ఆ తర్వాత బాలకృష్ణ సినిమాలో కూడా ఐటెం సాంగ్‌ చేసింది హంసా నందిని. అంతేకాదు గతేడాది నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో నాగార్జునతో రొమాన్స్‌ చేసింది. ఆ సినిమా గతేడాది సంక్రాంతికి సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టింది. అలా హంసా ఐటెం సాంగ్‌ సినిమా సక్సెస్‌కి తోడవుతోంది. దాంతో ఆమెకు డిమాండ్‌ పెరిగిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ఐటెం సాంగ్‌లో ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. అది యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా వస్తోన్న 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం మొదట్లో హాట్‌ యాంకర్‌ కమ్‌ హీరోయిన్‌ రేష్మీ గౌతమ్‌ పేరు వినబడింది. కానీ జస్ట్‌ మిస్‌ అయ్యిందట ఆ ఛాన్స్‌ని రేష్మీ. రాజ్‌ తరుణ్‌ అంటే మినిమమ్‌ గ్యారంటీ హీరోగా పేరుంది. అలాంటి హీరో సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తే రేష్మీకి మరిన్ని ఆఫర్స్‌ వస్తాయని ఆశించింది. కానీ ఇంతలోనే ఆ ఛాన్స్‌ని హంసా నందిని కొట్టేసిందట. కుక్కల కిడ్నాపర్‌గా రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS