ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్: మిస్టర్ & శివలింగ

By iQlik Movies - April 16, 2017 - 05:19 PM IST

మరిన్ని వార్తలు

శుక్రవారం రాగానే ప్రేక్షకుల ముందుకి కొత్త చిత్రాలు రావడం ప్రతి వారం జరిగే ప్రక్రియనే. అందులో భాగంగానే ఈ వారం వరుణ్ తేజ్ మిస్టర్ అలాగే లారెన్స్ శివలింగ చిత్రాలు విడుదలయ్యాయి.

ఆసక్తికరంగా స్ట్రెయిట్ తెలుగు సినిమా మిస్టర్ కన్నా అనువాద చిత్రమైన శివలింగ కే ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు పడ్డాయి. మిస్టర్ సినిమాకి మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ రావడం అది కాస్త రానురాను ఫ్లాప్ టాక్ వైపు వెళ్ళడంతో ఇది ఫ్లాప్ సినిమా జాబితాలో చేరిపోయింది.

మిస్టర్ చిత్రం ఫ్లాప్ టాక్ ఎఫ్ఫెక్ట్ హీరో, హీరోయిన్స్ కన్నా డైరెక్టర్ శ్రీను వైట్ల పైనే ఎక్కువగా పడినట్టు తెలుస్తుంది. అసలే ఫ్లాప్స్ తో సతమవుతున్న శ్రీనుకి ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

ఇక లారెన్స్ తో పాటుగా ఈ థ్రిల్లర్ లో తన సత్తా చాటిన గురు చిత్రం ఫేం రితికా సింగ్ కూడా తన బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది. సీనియర్ డైరెక్టర్ పీ వాసు మరోసారి తనకి పట్టున్న త్రిల్లర్ సబ్జెక్టు ని బాగా హేండిల్ చేశాడు.

మొత్తానికి ఈ వారం శివలింగ ముందు మిస్టర్ చతికిలపడింది అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now