'పటేల్‌'గా జగపతి హీరోయిజం సూపర్బ్‌

మరిన్ని వార్తలు

ఒకప్పుడు లవర్‌ బోయ్‌గా, ఫ్యామిలీ ఆడియన్స్‌ అభిమానాన్ని పొందిన హీరో జగపతిబాబు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌గా మారాడు. స్టైలిష్‌ విలన్‌గా మంచి గుర్తింపు పొందాడు. అలాగే 'శ్రీమంతుడు' తదితర సినిమాలతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే నిండైన పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు. వయసు పెరిగినా కానీ ఆయనలోని హ్యాండ్‌సమ్‌ లుక్స్‌, బాడీ ఫిట్‌నెస్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆయన మేకప్‌ వేసుకుని హీరోగా సినిమా చేస్తే కాదనేవారే లేరు. కానీ జగపతిబాబు అలా చేయలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కొత్తగా ట్రై చేశాడు. సక్సెస్‌ అయ్యాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో 'పటేల్‌ ఎస్‌ఐఆర్‌' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. మామూలుగా ఎస్‌ఐఆర్‌ అంటే సర్‌ అని అర్థం. కానీ మధ్యలో డాట్స్‌ పెట్టారు. అంటే ఇందులో ఏదో అర్థం ఉండి ఉండాలి. టీజర్‌ బయటకు వచ్చింది. సూపర్బ్‌ రెస్పాన్స్‌ ఈ టీజర్‌కి వస్తోంది. తెల్లటి గడ్డం, జుట్టుతో 50 ప్లస్‌ ఏజ్‌లో ఉన్నట్లుగా జగపతిబాబు కనిపిస్తున్నాడు. ఎంతైనా కండల వీరుడు కదా, ఆ కండల ప్రదర్శన అలాగే ఉంది. శరీరమ్మీద టాట్టూస్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. డైలాగ్స్‌ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. తెల్లని గడ్డం, జుట్టుతో జగపతిబాబు స్టైలిష్‌ లుక్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఓ చిన్న అమ్మాయిని కాపాడే వ్యక్తిగా జగపతిబాబు నటిస్తున్నట్లు టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా సినిమా టీజర్‌ విడుదలయ్యింది. వాసు పరిమి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించగా, వారాహి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS