'ఆటగాళ్లు' ఆట మొదలైంది

మరిన్ని వార్తలు

నారా రోహిత్‌, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా ఈ రోజు నుండీ రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. పరుచూరి మురళి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. 

జగపతిబాబు, రోహిత్‌ పాత్రల చిత్రీకరణ చాలా కొత్తగా ఉండబోతోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా ఆకట్టుకుంటున్న జగపతిబాబు ఈ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నారా రోహిత్‌ ఇటీవలే 'బాలకృష్ణుడు' సినిమాతో అలరించాడు. అదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. తాజా మూవీతో సస్పెన్స్‌ థ్రిల్‌ ఇస్తానంటున్నాడు. ఈ తరహా క్యారెక్టర్‌లో నటించడం ఇదే తొలిసారి అట నారా రోహిత్‌కి. భిన్నమైన క్యారెక్టర్స్‌లో నటించడం అంటే నారా రోహిత్‌కి చాలా ఇష్టం. 

ఏ క్యారెక్టర్‌లోనైనా తనదైన శైలి నటనతో ఆకట్టుకుంటాడు. అలాంటిది ఈ సినిమాలోని క్యారెక్టర్‌కి ఆడియన్స్‌ ఇంకా ప్రశంసిస్తారంటున్నాడు. తొలి సినిమా నుండీ, విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా, కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాడు నారా రోహిత్‌. ఈ సినిమా కథ కూడా అలాగే ప్రేక్షకుల్ని మెప్పిస్తుందంటున్నాడు. 

జగపతిబాబు వంటి సీనియర్‌ నటుడితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో ఈ ఇద్దరి క్యారెక్టర్స్‌కీ ఈక్వెల్‌ వెయిట్‌ ఉండబోతోందట. అయితే ఇంతకీ నారా రోహిత్‌ ఈ సినిమాలో హీరోనా? విలనా..? అలాగే జగపతిబాబు కూడా.. ఈ మధ్య జగపతిబాబు విలన్‌గానూ, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే కాకుండా, హీరోగా కూడా నటించారు. 'పటేల్‌ సర్‌' సినిమాలో చాలా కాలంగా హీరోగా కనిపించారు జగపతిబాబు.  

అలాగే ఈ సినిమాలో ఈ ఇద్దరూ హీరోలేనా? లేక ఒకరు విలన్‌, హీరోనా.. అనే విషయం తెలియాల్సి వుంది. 'ఆటగాళ్లు - గేమ్‌ ఫర్‌ లైఫ్‌' అనే క్యాప్షన్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS