'జై లవ కుశ' ఫస్ట్ డే కలక్షన్స్ అదిరిపోయాయ్

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ నటించిన 'జై లవకుశ' సినిమా నిన్న భారీ స్థాయిలో విడుదల అయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ నటన అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. దీనికి తగ్గట్టుగా జై లవకుశ బాక్సాఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 15 నుండి 20 కోట్ల మధ్య వసూలు చేసినట్టు సమాచారం. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ ద్వారా మూడున్నర కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ లో వెల్లడించారు.

నైజాం లో ఈ సినిమా 5.05 కోట్ల షేర్, సీడెడ్ లో 3.77 కోట్లను వసూలు చేసింది. ఫస్ట్ డే వసూలు చేసిన కలెక్షన్స్, వీకెండ్ లో కూడా కొనసాగితే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. జై లవకుశ సినిమా బడ్జెట్ 30 నుండి 45 కోట్ల మధ్య జరిగింది. రిలీజ్ కి ముందే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల బిజినెస్ జరిగింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS