హాలీవుడ్ మేకప్ మ్యాన్ జైలవకుశకి పని చేయలేదా?

మరిన్ని వార్తలు

జైలవకుశ చిత్రం మొదలయ్యే సమయంలోనే ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తాడు అన్న వార్త బయటకి రావడమే గాక అందుకుగాను హాలీవుడ్ లో ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్ అయిన హార్ట్ వెల్ ఈ చిత్రానికి పనిచేస్తాడు అన్న వార్తలు వచ్చాయి.

దీనికి సంబంధించి హార్ట్ వెల్ మన ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటో అప్పుడు వైరల్ అయింది. అయితే ఈ చిత్రం విడుదల అయ్యాక మాత్రం ఆ స్థాయిలో మేకప్ కాని అంత చెప్పుకోదగ్గ మేకప్ అంశాలు కాని ఏమి కనపడకపోవడంతో అందరు ఆశ్చర్యపోయారు.

అయితే మరి దీనికి సంబంధించిన విషయాల పై క్లారిటీ ఎవరికి లేకపోవడంతో అందరు ఈ అంశం పై క్వశ్చన్ మార్క్ తోనే ఉండిపోయారు.

 

మరి ఇంతకి ఈ మేకప్ ఆర్టిస్ట్ సినిమాకి పనిచేశాడా లేక చేయలేదా అనే ప్రశ్నమిగిలిపోనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS