శ్రీదేవి కూతురు వాట్‌ ఏ సీన్‌ హై!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ శ్రీదేవి. అతిలోక సుందరిగా ఆమె అందానికి దాసోహం అనే వారుండరు. వయసు పెరిగినా ఆమెలోని అందం అస్సలు తరగడం లేదు. అదే శ్రీదేవి ప్రత్యేకత. ఇప్పుడు ఆ అందానికి పోటీ ఆమె కూతురు జాన్వీకపూర్‌ కూడా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. 

'ధడక్‌' సినిమా ద్వారా జాన్వీ పరిచయం అవుతోంది. ఈ సినిమా నుండి గతంలో కొన్ని స్టిల్స్‌ బయటికి వచ్చాయి. అవి రొమాంటిక్‌ అండ్‌ గ్లామరస్‌ స్టిల్స్‌. తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన స్టిల్‌కి అంతా ఆశ్చర్యపోతున్నారు. శ్రీదేవి కూతురు నటనలో శ్రీదేవిని మించిపోతుందా? ఏంటి అని వాపోతున్నారు. ఆ ఫోటోలో జాన్వీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ అలా ఉంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. మరాఠీలో ఘన విజయం సాధించిన 'సైరత్‌' సినిమాకి హిందీ రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ స్టిల్‌లో జాన్వీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ గురించే బాలీవుడ్‌ అంతా మాట్లాడుకుంటున్నారు. 

ఫోటోల ఓ పక్క గన్‌ ఉంది. ఆమె వెనక హీరో ఇషాన్‌ ఉన్నాడు. లుక్‌ చూస్తే ఓ కొత్తరకమైన ఫీల్‌ కలుగుతుంది. జాన్వీ యాక్టింగ్‌ టాలెంట్‌ ఒక్క ఫోటో ఎక్స్‌ప్రెషన్‌తో ప్రూవ్‌ అయిపోయింది. ఇక సినిమాలో అమ్మడి నటన ఇంకెంతలా ఉండబోతోందో అనే దానిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందానికి అందం, నటనకి నటన, డాన్సింగ్‌ టాలెంట్‌ ఇలా అన్నింట్లోనూ శ్రీదేవి కూతురు అమ్మని మించిన తనయగానే సిద్ధమైన తర్వాతే బరిలోకి దిగినట్లుంది. ఇక స్క్రీన్‌పై ఈ ముద్దుగుమ్మ పండించే హావభావాలు, టాలెంట్‌ ఏ రేంజ్‌లో ఉండనున్నాయో చూడాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS