అరవింద సమేత క్లైమాక్స్ మార్చేశారట?!

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అరవింద సమేత సినిమా గురించిన ఒక తాజా సమాచారం బయటకి వచ్చింది. అయితే ఈ తాజా విషయం మాత్రం ఇప్పుడు ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నది.

ఇంతకి ఆ వార్త ఏంటంటే- అరవింద సమేత సినిమా కథ తొలుత రాసినప్పుడు త్రివిక్రమ్ గత చిత్రాల మాదిరిగానే ఎమోషనల్ క్లైమాక్స్ రాసాడట. అయితే ఇప్పుడు ఫ్లాప్ లో ఉన్న త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఒక సలహా ఇచ్చాడట. ఆ సలహాతో సినిమాకి ముందుగా రాసిన క్లైమాక్స్ మార్చి ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ క్లైమాక్స్ రాసినట్టు తెలుస్తున్నది.

త్రివిక్రమ్ గత సినిమా ఫ్లాప్ అవ్వడంతోనే ఇలా తన కథలో మార్పులు చేయడానికి వెనుకాడటం లేదట. ఇదే సమయంలో సంగీత దర్శకుడిగా అనిరుద్ ని తీసేసి తమన్ ని పెట్టడానికి కారణం కూడా త్రివిక్రమ్ ఫ్లాప్ లో ఉండటమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా... ఈ సినిమా తో త్రివిక్రమ్ ఫ్లాప్ నుండి బయటపడాలని కోరుకుందాం..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS