ADA

చందమామ ఈజ్‌ బ్యాక్‌

By iQlik Movies - January 13, 2017 - 09:14 AM IST

మరిన్ని వార్తలు

2016లో ఘోరమైన ఫ్లాపులు చవిచూసేసింది అందాల చందమామ కాజల్‌. అయితే 2017లో మాత్రం కాజల్‌ అదిరిపోయే సక్సెస్‌ కొట్టింది 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో. ఈ సినిమా దెబ్బకి కాజల్‌ ఇమేజ్‌ పదింతలయ్యిందంటున్నారు టాలీవుడ్‌లో. చాలాకాలం క్రిందట 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో పరిచయమ్యింది కాజల్‌ అగర్వాల్‌. తన అందచందాలతో, నటనతో తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్ద కాలానికి పైగా హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదు. 'మగధీర' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సినిమా ఆమె ఖాతాలో ఉంది. అలాగే 'ఆర్య', 'టెంపర్‌', 'బృందావనం', 'ఎవడు' లాంటి సక్సెస్‌లు కూడా కాజల్‌ సొంతం చేసుకుంది. అయితే కెరీర్‌ ఇక ముందుకు సాగడం కష్టమనే టైమ్‌లో చిరంజీవితో చేసిన 'ఖైదీ' సినిమా ఆమెకు పెద్ద విజయాన్ని అందించి, తెలుగు సినీ పరిశ్రమలో ఆమె స్థానాన్ని మళ్ళీ సుస్థిరం చేసింది. సీనియర్లయినా యంగ్‌ హీరోలైనా ఎవరి పక్కనైనా తళుక్కున మెరిసే టాలెంట్‌ అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ది. 'ఖైదీ' సినిమా సక్సెస్‌ తనలో నూతన ఉత్సాహాన్నిచ్చిందంటున్న ఈ బ్యూటీ, తమిళంలోనూ అలాగే హిందీలోనూ వరుసగా ఈ ఏడాది సినిమాలు చేయబోతున్నట్లు చెప్పింది.


iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS
Loading...
Loading...

AD

Keshava Telugu Movie

AD

We are Hiring - Content Writer

AD

Sarkar 3 Movie Review