కార్తితో రకుల్‌ మళ్లీనా?

మరిన్ని వార్తలు

తమిళ హీరో కార్తీ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఖాకీ'. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన చిత్రమిది. 'ఊపిరి' సినిమాతో తెలుగులోనూ మంచి మార్కెట్‌ సంపాదించుకున్నాడు హీరో కార్తి. అతి తక్కువ కాలంలో తెలుగులో ఇంత మంచి మార్కెట్‌ సంపాదించుకున్న తమిళ హీరో కార్తి అనే చెప్పవచ్చు. 

ఈ సినిమాలో కార్తి పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. కార్తీకి భార్య పాత్రలో రకుల్‌ నటిస్తోంది. కార్తి, రకుల్‌ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రియల్‌గా సహజత్వానికి దగ్గరగా ఉంటాయట. అంతే కాదు ఇది ఓ యదార్ధ గాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఓ పోలీస్‌ ఆఫీసర్‌ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. నేర పరిశోధనలో పోలీసుల పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఈ సినిమాలో రియలిస్టిక్‌గా చూపించారట. పోలీసులకు నేర పరిశోధనలంటే చాలా సాధారణ విషయమే. అయితే ఆ పరిశోధనలో వారు ఎదుర్కొనే విషమ పరిస్థితుల్ని, ఈ సినిమా ద్వారా ఆడియన్స్‌కి చాలా కనెక్టివ్‌గా చూపించారట. 

అందుకే ఎన్నో పోలీస్‌ స్టోరీలు తెరకెక్కినప్పటికీ ఇంతవరకూ ఇలాంటి స్టోరీ రాలేదని అంటోంది చిత్ర యూనిట్‌. కాగా రకుల్‌తో కార్తీ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉండబోతోందట. అంతేకాదు రకుల్‌తో కార్తీ మరో సినిమాలో నటిస్తున్నాడు. 'ఖాకీ'లో రకుల్‌, భార్య పాత్ర పోషిస్తుండగా, ఈ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే కొత్త చిత్రం ఓ క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అట. అన్నట్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కార్తి సోదరుడు సూర్యతోనూ ఓ సినిమాలో నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS