2016: శైలజా, అందమంటే నీదే!

మరిన్ని వార్తలు

ఓ హీరోయిన్‌ గురించి ఏడాది అంతా మాట్లాడుకోవడమంటే, ఆ హీరోయిన్‌ నాలుగైదు సూపర్‌ హిట్‌ సినిమాల్ని ఒకే ఏడాదిలో చేసేసి ఉండాలి. పిచ్చ పిచ్చగా వెండితెరపై గ్లామర్‌ ఒలకబోసెయ్యాలి. అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంటూ ఉండాలి. మీడియాలో అందుబాటులో ఉండాలి. లేదంటే జనం తొందరగా మర్చిపోతారు. కానీ 'నేను శైలజ' ఫేం కీర్తి సురేష్‌కి అవేమీ వర్తించవు. ఒక్కటంటే ఒక్క సినిమానే కీర్తి సురేష్‌ని టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మార్చేసింది. అదే 'నేను శైలజ'. 2016 ప్రారంభంలో ముందుగా వచ్చిన సినిమా 'నేను శైలజ'.

ఘనవిజయమే సాధించిన ఈ సినిమాలో కీర్తి సురేష్‌ గ్లామరస్‌గా ఏమీ కనిపించలేదు. హుషారైన పాత్ర అసలే కాదు. కానీ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఆ సినిమా తరువాత ఇంకో సినిమా ఒప్పుకోడానికి చాలా టైమ్‌ తీసుకుంది కీర్తి సురేష్‌. తమిళంలో మాత్రం ఒకటీ అరా సినిమాలు చేస్తూ కెరీర్‌లో బిజీగానే ఉంది. గ్లామరస్‌ పాత్రలైతే చేయబోనని చెప్పడం ద్వారా తెలుగులో అంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. 


నానితో కీర్తి సురేష్‌ నటిస్తున్న 'నేను లోకల్‌' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదలైతే కీర్తి సురేష్‌ నుంచి స్ట్రెయిట్‌గా ఈ ఏడాది వచ్చిన సినిమాల సంఖ్య రెండుకి చేరుకుంటుంది. 'రైల్‌' అనే ఓ డబ్బింగ్‌ సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిందిగానీ ఆ సినిమా కీర్తి సురేష్‌కి పరాజయాన్నే మిగిల్చింది. అయినప్పటికీ కూడా ఈ ఏడాది ఎక్కువమంది ఏ హీరోయిన్‌ గురించి అయినా మాట్లాడుకున్నారంటే అది ఆమె మాత్రమే. అంతలా తెలుగు సినీ రంగంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది కీర్తి సురేష్‌. ఎందుకంటే, ఏమో తెలియదు. ఆమె నవ్వులో ఏదో స్పెషల్‌ ఉంటుంది. ఆ నవ్వుకే తెలుగు సినీ పరిశ్రమ స్పెల్‌ బౌండ్‌ అయినట్లుంది. పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు స్వయంగా సోషల్‌ మీడియాలో కీర్తి సురేష్‌ ఇటీవల ప్రకటించింది. ఇంకో వైపున మహేష్‌తో కూడా హీరోయిన్‌గా ఆమెకు ఛాన్స్‌ వచ్చిందని సమాచారమ్‌. అలాగే కొందరు యువ హీరోలు కూడా కీర్తి సురేష్‌తో సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారట. 


2016లో రెండు సినిమాలకే పరిమితమైన ఈ నేచురల్‌ బ్యూటీ 2017లో మాత్రం తెలుగులో నాలుగైదు సినిమాలు స్ట్రెయిట్‌గా చేసే అవకాశం ఉంది. అయితే గ్లామర్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని అంటోంది ఈ బ్యూటీ. గ్లామరస్‌గా కనిపించడం కష్టమేమీ కాదు, కానీ నేను గ్లామర్‌ని నమ్ముకోలేదని చెప్పే కీర్తి సురేష్‌కి అదే పెద్ద ప్లస్‌ పాయింట్‌గా మారింది. వస్తూనే, వెండితెరపై విచ్చలవిడిగా అందాల విందు చేసేసే హీరోయిన్లతో పోల్చి చూస్తే కీర్తి సురేష్‌ నిజంగానే చాలా స్పెషల్‌ క్వాలిటీస్‌ ఉన్న హీరోయిన్‌గా చెప్పవచ్చు. అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS