ఖైదీ కోసం సౌదీ కూడా

మరిన్ని వార్తలు

చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్‌ 150' జనవరి 11న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. ఆ రోజు కోసం తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానులంతా ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ సినిమా కోసం విదేశాల్లో ఉన్న తెలుగు జనం కూడా అంతే ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో పెద్దగా కొత్తదనం లేదు. కానీ మెగా అభిమానం విదేశాల్లో కూడా ఏం తక్కువగా లేదు. అందులో భాగంగా సౌదీలోని రియాద్‌లో ఓ కనెస్ట్రక్షన్‌ కంపెనీ 'ఖైదీ' రిలీజ్‌ డేను తమ ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించింది.ఈ విషయాన్ని నెటిజన్‌ ఒకరు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఇది నిజంగా గొప్ప విషయమే. అక్కడి తెలుగు వారు కూడా మెగాస్టార్‌ సినిమాని ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ కంపెనీ అలా సెలవు ప్రకటించింది. గతేడాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన 'కబాలి' సినిమా విడుదల రోజు కూడా విదేశాల్లోని చాలా కంపెనీలు తమ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించి రజనీపై అభిమానాన్ని చాటుకున్నాయి. అలాగే ఇప్పుడు మెగా అభిమానం సౌదీలో ఈ రకంగా హడావిడి చేస్తోంది. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రిలీజ్‌కి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయినట్లే. సంక్రాంతికి ముందే ఈ సినిమాతో అసలు సిసలైన సంక్రాంతి పండగ రానుంది అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ క్రియేట్‌ చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. ఇక పాటల సంగతి అయితే వేరేగా చెప్పనక్కర్లేదు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో పాటలు అదిరిపోతున్నాయ్‌. కాజల్‌ అగర్వాల్‌ ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS