ఖైదీకి వంద కోట్లు అఫీషియల్‌

మరిన్ని వార్తలు

చిరంజీవి రీ ఎంట్రీలో వచ్చిన సినిమా 'ఖైదీ నెంబర్‌ 150' వసూళ్ల గురించి అనేక రకాల న్యూస్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సినిమా వసూళ్ల విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వసూళ్ల లెక్క తప్పని కొంత మంది, కరెక్ట్‌ అని కొంత మంది గుసగుసలాడుకుంటున్నారు. అందుకే తాజాగా చిత్ర యూనిట్‌ మీడియా ముందుకొచ్చింది. ఈ సినిమా వసూళ్ల లెక్కను అఫీషియల్‌గా డిక్లర్‌ చేసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఖైదీ' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన వసూళ్లు అక్షరాలా వంద కోట్లు అని అల్లు అరవింద్‌ తెలిపారు. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక వారం రోజులు మాత్రమే గడిచింది. ఇంత తక్కువ టైంలో ఈ వసూళ్లు రావడం అన్నది చిన్న విషయం కాదు. ఈ లెక్కపై ఇంతవరకూ ఉన్న పలు అనుమానాలు అల్లు అరవింద్‌ ప్రెస్‌ మీట్‌తో క్లారిటీకి వచ్చేశారు. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మెగా రికార్డులు నమోదు చేసింది. మెగాస్టార్‌ రీ ఎంట్రీ సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయ్యింది. అంతేకాదు ఈ సినిమా క్లాస్‌ మాస్‌ అనే తేడా లేకుండా అన్ని చోట్లా విజయం గర్వంతో దూసుకెళ్లిపోతోంది. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటే ఇదే మరి. బాస్‌ రేస్‌లోకి ఎంటరైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది అనేది ప్రాక్టికల్‌గా నిరూపించింది ఈ సినిమా. ఇదే జోరుతో మెగాస్టార్‌ 151వ సినిమాకి కూడా రంగం సిద్ధం చేసేస్తున్నారు. రామ్‌ చరణ్‌ తొలి ప్రయత్నంలో అందుకున్న సక్సెస్‌ జోరుతో నెక్స్ట్‌ సినిమాకి కూడా తానే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడం విశేషం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS