'గోల్డెన్‌ బ్యూటీ' కైరా అద్వానీ

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ తాజాగా 'భరత్‌ అనే నేను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే బంపర్‌ హిట్‌ కొట్టేసిందీ బ్యూటీ. దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు మార్మోగిపోతోందిప్పుడు. రావడం రావడమే రెండు పెద్ద సినిమాల్లో ఛాన్స్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది 'భరత్‌' విజయంతో. 

ఓ పక్క మహేష్‌తో 'భరత్‌ అనే నేను' చిత్రంలో నటిస్తూనే, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ - బోయపాటి సినిమాలోనూ ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. భరత్‌తో హిట్‌ కొట్టడంతో పాటు, సినిమాలో కైరా అద్వానీ చాలా అందంగా ఉందనీ, ప్రెజెన్స్‌ చాలా బాగుందనీ టాక్‌ వినిపిస్తోంది. తొలి సినిమాకే ఇంత పోజిటివ్‌ టాక్‌ రావడంపై అమ్మడిని అంతా గోల్డెన్‌ బ్యూటీ అని పొగిడేస్తున్నారు. అసలే హీరోయిన్స్‌ కొరత. అందులోనూ చాలా కాలంగా సరైన హిట్‌ లేక సతమతమవుతున్న సూపర్‌స్టార్‌కి ఈ ముద్దుగుమ్మ రూపంలో సూపర్‌ హిట్‌ దక్కింది. దాంతో లక్కీ బ్యూటీ అయిపోయింది కైరా అద్వానీ. 

'బ్రహ్మూెత్సవం' డిజాస్టర్‌ తర్వాత, భారీ అంచనాలతో తెరకెక్కిన మహేష్‌ బైలింగ్వల్‌ మూవీ 'స్పైడర్‌' కూడా నిరాశ పరచడంతో, ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు, మహేష్‌ కూడా భారీ హామీ ఇచ్చారు ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ కొడతానని. ఆ హామీని సూపర్‌స్టార్‌ నెరవేర్చుకోవడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో డి.వి.వి.దానయ్య నిర్మించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS