అదిరింది అందాల రాక్షసి

మరిన్ని వార్తలు

తొలి సినిమాతోనే 'అందాల రాక్షసి' అన్పించుకున్న లావణ్య త్రిపాఠి, వెండితెరపై గ్లామర్‌ ఒలకబోసేయడంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. 'భలే భలే మగాడివోయ్‌' సినిమాలో క్యూట్‌గా కన్పిస్తూనే, పాటల్లో హాట్‌ అప్పీల్‌ని పండించిన ఈ బ్యూటీ, 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో చీరకట్టులోనే హాట్‌నెస్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళిపోయింది. అటు గ్లామర్‌తో, ఇటు పెర్ఫామెన్స్‌తో సత్తా చాటుతోన్న లావణ్య, ఈ ఏడాది వరుస రిలీజ్‌లతో మరింత స్టార్‌డమ్‌ పొందేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సోషల్‌ మీడియాలో ఇదిగో ఇలా హాట్‌ అండ్‌ క్యూట్‌ పోజుతో ఎట్రాక్ట్‌ చేసేసింది అభిమానుల్ని. ఇందులో హాట్‌ అప్పీల్‌ ఏముంది? అంటారా! ఆమె కళ్ళు, ఆమె పెదవులు - ఇంతకన్నా హాట్‌ అప్పీల్‌ ఇంకేముంటుంది? హాట్‌ అప్పీల్‌ అంటే అంగాంగ ప్రదర్శన మాత్రమే కాదు, కళ్ళలోనే లోతైన భావాల్ని పండించేయొచ్చనడానికి ఇంతకన్నా బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ ఇంకేమీ అవసరం లేదు. దటీజ్‌ అందాల రాక్షసి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS