అసలు సూపర్ స్టార్స్ అంటే వాళ్ళే: మహేష్ బాబు

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ తన తాజా రిలీజ్ అయిన స్పైడర్ చిత్రంతో మొదటిసారిగా తమిళంలోను ప్రవేశిస్తున్నాడు. ఇంకొక మూడురోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్నది.

ఈ సందర్భంలో మహేష్ మాట్లాడుతూ- మనదేశంలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు కాని, అందులో నావరకైతే అసలైన సూపర్ స్టార్స్ అంటే చిరంజీవి & రజినీకాంత్ లు అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే సినిమాలతో సంబంధం లేకుండా వారికోసం థియేటర్లకి వెళుతుంటారు. అయితే తనకి మాత్రం నటుడు, స్టార్ కన్నా సినిమానే ఎక్కువ అని తన మనసులో మాట భయటపెట్టేశాడు.

ఇక స్పైడర్ గురించి మాట్లాడుతూ- ఈ చిత్రం తన మనసుకెంతో నచ్చిన సినిమాని అలాగే దర్శకుడు మురుగదాస్ కూడా ఈ చిత్రాన్నిచాలా అధ్బుతంగా తెరకెక్కించారు అని చెప్పాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS