హోలీ పండగలో మహేష్!

By iQlik Movies - November 14, 2017 - 12:04 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం ‘భరత్ అను నేను’ గురించిన ఒక ఆసక్తికర విషయం తెలిసింది.

అందుతున్న వివరాల ప్రకారం, భరత్ అను నేను చిత్రంలో హోలీ పండుగ నేపధ్యంలో సాగే ఒక పోరాట సన్నివేశాన్ని తీయనున్నారట. ఈ పోరాట సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవనుంది అన్న వార్తల నడుమ అందరికి ఈ ఎపిసోడ్ పైన అంచనాలు పెరిగిపోతున్నాయి.

యాక్షన్ సన్నివేశాలని అందరికి నచ్చే విధంగా తెరకేక్కిస్తాడు అన్న పేరు కొరటాల శివ సొంతం. అలాంటిది ఇక ఈ హోలీ సన్నివేశం ఎలా చిత్రీకరించబోతున్నాడో అన్న ఆసక్తిలో సూపర్ స్టార్ అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహేష్ ఇండియాకి తిరిగి రాగానే ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయనున్నారట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now