మహేష్ కత్తి & పవన్ ఫ్యాన్స్ ఎపిసోడ్ లో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?

మరిన్ని వార్తలు

గత కొద్ది నెలలుగా మహేష్ కత్తి అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వాగ్వాదానికి మొన్న రాత్రే తెరపడింది. కలిసి సేల్ఫీలు దిగుతూ, స్వీట్లు పంచుకుంటూ దిగుతూ తమ మధ్య జరిగిన వివాదానికి తెరదించారు. 

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కొద్దో గొప్పో లాభపడింది ఎవరయ్యా అంటే అది- మహేష్ కత్తి అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. తనపైన మానసికంగా దాడికి పాల్పడుతున్నారు అంటూ, ఈ సమాజంలో తనకి అంటూ హక్కులు ఉంటాయి అని వాటిని పవర్ స్టార్ అభిమానులు హరిస్తున్నారు అంటూ దీనికి కారణమైన పవన్ కళ్యాణ్ తనకి క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

ఇక ఇలా డిమాండ్ చేస్తున్న ఈయనని తెలుగు న్యూస్ చానల్స్ తమ TRPల కోసం చాలా బాగా ఉపయోగించుకున్నాయి. ఎందుకంటే ఈయనకి సంబందించిన అంశాన్ని చాలా పెద్దఎత్తున్న ప్రాధాన్యం ఇచ్చి చూపడంతో మహేష్ కత్తికి ఒక స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టడంలో టీవీ ఛానల్స్ తమవంతు పాత్ర బాగా పోషించాయి అని చెప్పొచ్చు. 

మహేష్ కత్తి పైన కోడిగుడ్లతో దాడి అంతకుముందు ఆయన నటి పూనం కౌర్ పైకి సంధించిన ప్రశ్నలు అలాగే ఈయన ఇండస్ట్రీలో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలకి మెసేజులు పెడతాడు అంటూ ప్రచారం రావడం వంటివి ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ అంశాలు.

ఇక ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరాక నిన్నటినుండి ఆయనకి పవన్ ఫ్యాన్స్ మధ్య సరదా ఫోన్ సంభాషణలు జరుగుతుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం. మొన్నటివరకు “మీరా-నేనా” అన్నట్లు ఉన్న పరిస్థితి ఇప్పుడు ఒక్కసారిగా మనమందరం అని అనుకుంటుండడం ఒక రకంగా ఆరోగ్యకరమైన పరిణామమే అయినప్పటికీ ఈ మొత్తం ఎపిసోడ్ ని ఫాలో అయిన సాధారణ ప్రేక్షకులు మాత్రం నోరు వెళ్ళబెడుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో పిచివాళ్ళు, వెర్రివాళ్ళు ఎవరు అంటే టీవీలు చూసిన సామాన్య జనం... ఇదే నిష్టూరమైన నిజం. ఎందుకంటే మహేష్ కత్తి కోరుకున్న దాంట్లో సగం అనగా పవన్ కళ్యాణ్ నుండి పరోక్ష పత్రం (లేఖ) అలాగే బోలెడంత పబ్లిసిటీ. ఇక పవన్ ఫ్యాన్స్ కూడా తమ హీరో పైన తమకి ఉన్న విచ్చలవిడి ప్రేమని చూపెట్టుకునే ఓ పెద్ద వేదికగా ఈ పూర్తి ఎపిసోడ్ దొరకడం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS