మహేష్ స్పైడర్ ప్రీ-రిలీజ్ టాక్

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ చిత్రం ఇంకొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రం పైన విపరీతమైన క్రేజ్ ఉంది.

దీనికి తగట్టుగానే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉంది. ముఖ్యంగా ఈ చిత్రం సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చినట్టు అలాగే ట్రైలర్ లో కనిపించిన VFX షాట్స్ ధియేటర్లో ప్రేక్షకులకి ఒక కొత్త అనుభూతిని మిగల్చనున్నాయి అని యూనిట్ వర్గాల ఇన్పుట్. దర్శకుడిగా మురుగదాస్ ఆ సీన్స్ ని చాలా బాగా తెరకెక్కించాడు అని అతని టేకింగ్ చూసి అందరు ఫిదా అవ్వాల్సిందే అని అందరు అంటున్నారు.

ఇక మహేష్ & కో ఈ చిత్రాన్ని తమ శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తుండడంతో స్పైడర్ పైన అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఈ పాజిటివ్ రిపోర్టు ఈ చిత్రం తాలుకా మొదటిరోజు కలెక్షన్స్ కి ఏవిధంగా ఉపయోగపడనుంది అన్నది రెండు రోజుల్లో తెలియనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS