హాలీవుడ్ బాట పట్టిన మంచు మనోజ్

By iQlik Movies - February 13, 2018 - 12:40 PM IST

మరిన్ని వార్తలు

మంచు వారి చిన్న అబ్బాయి మంచు మనోజ్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే అది హీరోగా మాత్రం కాదు. 

వివరాల్లోకి వెళితే, మంచు మనోజ్ కుమార్ హాలీవుడ్ చిత్రమైన బాస్మతి బ్లూస్ చిత్రంలో ఒక పాటకి సంగీతం సమకూర్చాడు. తన స్నేహితుడు సంగీత దర్శకుడు అయిన అచ్చు రాజమణి, అమెరికన్ రాక్ బ్యాండ్ పెర్ల్ జామ్ తో కలిసి ఈ చిత్రం కోసం పనిచేశాడు. 

ఇప్పటికే తన చిత్రాలలో పాటలు రాయడం, పాడడం, ఫైట్స్ కంపోజ్ చేయడం వంటివి చేసిన మనోజ్ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ చిత్రానికి సంగీతం అందించడం నిజంగా అభినందించదగ్గ విషయం. 

ఇక ఈ సినిమాలో హీరో సోదరి పాత్రలో మంచు లక్ష్మి నటించడం విశేషం. ఆమె ఈ చిత్రం విడుదల కోసం ఈ మధ్యనే అమెరికా పయనమైంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS

iQlik App is now on Google Play Store. See what the Celebs are saying about this APP. Download right Now