GST అంటూ షాక్ ఇచ్చిన కీరవాణి

మరిన్ని వార్తలు

MM కీరవాణి- భారతీయ చలనచిత్ర సీమలోనే తనకంటూ సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన బాహుబలి రెండు చిత్రాలకి అందించిన నేపధ్య సంగీతంతో అంతర్జాతీయ స్థాయిలో తన పేరుని అందరు మాట్లడుకునేలా చేసుకోగలిగాడు.

ఇక ఇవన్ని అటుంచితే, కొద్దిసేపటి క్రితం ఆర్జీవీ తాజాగా అడల్ట్ స్టార్ అయిన మియా మల్కొవాతో కలిసి GOD, SEX & TRUTH అనే అడల్ట్ వీడియోకి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేశాడు. ఆ ట్రైలర్ లో ఉన్న కంటెంట్ చూసి అందరు షాక్ అయినదానికన్నా ఆ వీడియో కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుని ఇంకా ఎక్కువగా షాక్ అవుతున్నారు. 

ఇంతకి ఆ నేపధ్య సంగీతం ఇచ్చింది MM క్రీమ్ అంటే మన MM కీరవాణినే. ఈ టైటిల్ తో ఆయన బాలీవుడ్ లో సుపరిచితం. ఇక ఆర్జీవీ ఈ వీడియో గురించి ప్రస్తావిస్తూ అలాగే కీరవాణి అందించ నేపధ్య సంగీతాన్ని ప్రశంసిస్తూ- "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" కి తాను కూర్చిన సంగీతం మియా మాల్కోవా శృంగారంలో నాణ్యతనే కాకుండా ఆమె భావప్రకటనల్లోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని కూడా అత్యంత శక్తివంతంగా వ్యక్తపరచడానికి దోహదపడింది. 

సాధారణ స్వరకల్పనలకి అందని మహాద్భుతమైన "బాహుబలి" కి, ఆధ్యాత్మికతని నిలువెల్లా నింపుకున్న "అన్నమయ్య"కి సంగీతాన్ని కూర్చిన అత్యంత గొప్ప స్వరకవి కీరవాణి సెక్స్ విషయంలో కూడా అంతే నిబద్ధతని చూపడం, మియా మాల్కోవాలోని నిక్షిప్త నిధికి సరితూగే సంగీతాన్ని ఇవ్వటం నన్ను అబ్బురపరిచింది.”

మొత్తానికి ఈ అడల్ట్ వీడియోకి ఆ మూడ్ కి తగ్గట్టుగా నేపధ్య సంగీతం అందించి సంగీత దర్శకుడిగా ఎటువంటి సందర్భానికైనా న్యాయం చేయగలను అని నిరూపించగలిగారు కీరవాణి.

హ్యాట్స్ ఆఫ్ కీరవాణి గారు..

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS