నాగ్‌ చెబితే హిట్‌ కొట్టినట్లే!

మరిన్ని వార్తలు

నాగార్జున నిర్మాణంలో తెరకెక్కుతోన్న అఖిల్‌ రీ లాంఛింగ్‌ మూవీ 'హలో'. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుక జరిగింది. సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నామని ఈ ఆడియో ఫంక్షన్‌లో నాగార్జున అన్నారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని నాగార్జున దగ్గరుండి జాగ్రత్తగా డీల్‌ చేశారు. 

విక్రమ్‌ కుమార్‌ చేతిలో అఖిల్‌ రీ లాంఛింగ్‌ మూవీని పెట్టడంతోనే నాగార్జున సగం సక్సెస్‌ అందుకున్నట్లే. ఇక నిర్మాతగా సక్సెస్‌కి కావాల్సిన లెక్కలన్నీ పక్కాగా తెలిసినోడు నాగార్జున. ఆ యాంగిల్‌లోంచే ఈ సినిమాని ప్రమోట్‌ చేస్తున్నారు. సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనీ, అఖిల్‌ ఎంట్రీ ఈ సినిమాతో అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందనీ అంటున్నారు. 

ఇక డాన్సులు, యాక్టింగ్‌ తదితర అంశాల్లో ఈ సినిమాకి అఖిల్‌ బాగా రాటుదేలాడట. తొలి సినిమా 'అఖిల్‌'లోనే యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేసిన అఖిల్‌, ఇక ఈ సినిమాలో యాక్షన్‌ని ఓ రేంజ్‌లో చూపించాడట. ట్రైలర్‌లోనే ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ప్రేమ, యాక్షన్‌ మిళితమైన ఈ స్టోరీ కాన్సెప్ట్‌ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ని ఇవ్వబోతోందట. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌లో పాటలు వినసొంపుగా ఉన్నాయి. విజువల్‌గా పాటల చిత్రీకరణ ఇంకా కొత్తగా ఉండనుందట. అన్నట్లు ఈ సినిమాతో అనూప్‌, అఖిల్‌ తో ఓ పాట కూడా పాడించేశాడు. అఖిల్‌ తన గొంతుతో ఆ రొమాంటిక్‌ సాంగ్‌కి ఎక్స్‌ట్రా ఫీల్‌ని తీసుకొచ్చాడు. 

మరో పక్క ఆడియో ఫంక్షన్‌లో అఖిల్‌ లైప్‌ డాన్స్‌ పర్‌ఫామెన్స్‌ అందర్నీ ఆకట్టుకుంది. అలాగే లైవ్‌లో పాట కూడా పాడి ప్రేక్షకులందరికీ సర్‌ప్రైజ్‌ చేశాడు. ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శన్‌ ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఫ్రెష్‌ లుక్‌తో అఖిల్‌కి సరిజోడీగా ఈ ఇద్దరి జంట కనువిందు చేయనుంది 'హలో'తో. ఈ నెల 22న 'హలో' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS