మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి మ్యాజిక్‌ మొదలైంది

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'ఎంసీఏ - మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'. వేణు శ్రీరాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఫిదా' బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల 21న 'ఎంసీఏ' ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రేపు సాయంత్రం 6 గంటలకు 'ఎంసీఏ' ధియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  

ఆల్రెడీ వచ్చిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి అంటే ఇదీ.. అని నాని చెప్పిన సిగ్నేచర్‌ డైలాగ్స్‌కి యూత్‌లో రెస్పాన్స్‌ అదిరిపోయింది. అలాగే సాయి పల్లవి ఒక్క లుక్‌తో, ఒకే ఒక్క డైలాగ్‌తో సాయి పల్లవి చేసిన మాయా జాలం అంతా ఇంతా కాదు. జస్ట్‌ టీజర్‌కే ఈ ఇద్దరు నేచురల్‌ స్టార్స్‌ ఇంత చేస్తే, ఇక ట్రైలర్‌లో ఇంకెంత చేసుంటారు చెప్పిండి. అందుకే అభిమానులు ఆశక్తిగా ఎదురు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరూ ట్రైలర్‌తో మరోసారి మెస్మరైజ్‌ చేసేందుకు రెడీగా ఉన్నారు. 

మరోసారి షాకై, థ్రిల్‌ అయ్యేందుకు రెడీగా ఉండండి మరి. దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఒక హ్యాట్రిక్‌ కొట్టేసిన దిల్‌ రాజు, ఈ చిత్రంతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటి భూమిక కీలక పాత్ర పోషిస్తోంది. నానికి వదినగా భూమిక నటిస్తోంది. వదినా, మరిదుల మధ్య సాగే సంభాషణలు, సన్నివేశాలు హార్ట్‌ టచ్చింగ్‌గా ఉండనున్నాయట. 

లాంగ్‌ గ్యాప్‌ తర్వాత భూమిక ఓ మంచి పాత్ర ద్వారా ఎంట్రీ ఇస్తోంది. వరుస హిట్స్‌తో దూసుకెళ్తోన్న నాని ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకునుందుకు దూసుకొస్తున్నాడు. చూడాలి మరి మన మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి ఏం చేస్తాడో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS