ఖైదీలతో నవదీప్!

మరిన్ని వార్తలు

టైటిల్ చూసి షాక్ అవ్వకండి.. 

నిన్న దీపావళి సందర్బంగా హీరో నవదీప్, నటుడు ఆదర్శ్ బాలకృష్ణలు హైదరాబాద్ లోని చర్లపల్లి జైలులోని ఖైదీలతో గడిపారు. గత కొన్నిరోజులుగా చర్లపల్లి జైలులోనే జరుగుతున్న ఓ చిత్ర షూటింగ్ లో వీరు ఇరువురు పాల్గొంటున్నారు.

ఇక నిన్న దీపావళి పండుగని పురస్కరించుకుని అక్కడి ఖైదీలతో సరదాగా గడుపుతూ వారితో కలిసి దీపావళిని జరుపుకోవడం విశేషం. బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేం తెచ్చుకున్న ఈ ఇద్దరు (నవదీప్ & ఆదర్శ్ బాలకృష్ణ) ఇప్పుడు కలిసి ఒక చిత్రంలో నటిస్తుండడం ప్రేక్షకులకి ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వనుంది.

మొత్తానికి నిన్నటి రోజున ఖైదీలతో పండగ జరుపుకోవడం తమకి ఆనందాన్నిచ్చింది అని ఈ ఇద్దరు నటులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS